ABOUT US

Temple History

పూర్వము జన(శుతి ననుసరించి సుమారు 600 సంవత్సరములకు మునుపు నందన చక్రవర్తులచే ప్రతిష్టింపడినట్లుగా చెప్పబడుచున్న శ్రీ కాళికాంబ అమ్మవారు ఇక్కడ దక్షిణాఖిముఖముగా మహాశాంత స్వరూపిణిగా ఉండటం (ప్రపంచంలో ఎక్కడా లేని స్వరూపము. పంచబ్రహ్మలు (మను, మయ, త్వష్ట శిల్పి, విశ్వజ్ఞ్ర ఆ తల్లియొక్క సింమాసనమై ఉన్నారు. లోకస్థితి లయకారిణిగా, ధన, ధాన్య ధైర్య విజయ, విద్య సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా, వరములను ప్రసాదించు అష్టలక్ష్మీ స్వరూవిణిగా అమృత న్వరూవిణిగా, పరమ దయామయిగా, భక్తులచే నిత్యపూజలందుకుంటూ, నంద్యాల పట్టణమును నిత్యశోభాయమానంగా ఎటువంటి కష్టాలు కలుగకుండా అన్ని విధములుగా సర్వదా నంద్యాల పట్టణమును సుభిక్షంగా ఉండేలా చూడటం ఆ మహాతల్లి కరుణ ! పూర్వము దాదాపు 600 సంవత్సరములకు మునుపు నందన చక్రవర్తి ఈ ప్రాంతమును పరిపాలిస్తూ ఉండేవాడని చారిత్రకవూహ. అతడు మహా పర్మాకమ వంతుడై, అన్ని విద్యలయందు ఆరితేరినవాడై, రాజ్య విస్తరణ గావించాడు. ఆయన అమ్మవారికి మహాభక్తుడు. కొన్ని సంవత్సరముల తర్వాత అమ్మవారు ఆయనకు స్వప్నంలో సాక్షాత్కరంచి, తన యొక్క కోట ప్రదేశము నందు దక్షిణాభిముఖంగా, నన్ను ప్రతిష్టింపమనగా, మహానిష్టాగరిష్ఠులైన సిద్ద పుంగవులచే, కేవలం దినములలో ఒక్క గంటలోనే చక్రవర్తిగారు అమ్మవారిని 'ప్రతిష్ఠింపజేశారట. తదుపరి ఆ మహాతల్లి వారియొక్క తొమ్మిది తరాల వారికి మూలదేవతగా, మహావైభవంగా పూజలందుకొన్నది. కొన్ని వదల సంవత్సరముల తర్వాత సాక్షాత్తు జగద్దురువు ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారి ఆజ్ఞ మేరకు తన యొక్క 27వ యేట అమ్మవారిని దర్శించి, ముగ్ధుడై, ఇక్కడే కొన్ని మాసములు ఎంతో తీవ్ర సాధన చేశారని జనశ్రుతి. ఆయనకు అమ్మవారు సాక్షాత్మరించి నాయనా! ప్రపంచములో ఎక్కడేకాని ఓకే శిలపై శ్రీచక్రమును, ఆ శ్రీచక్రముపై ఆసనమున స్టాపింతమైన నేను మరెక్కడా కూడా లేదని సంబోధించెను. ఆ మహానుభావుడు అమ్మను అఖిలాండేశ్వరిగా, దక్షిణ కాళిక, శాంత స్వరూపిణిగా, ఈశాన్య మహిష మర్ధనిగా మరియు ఉచ్చిష్ట గణపతి మహాశక్తి స్వరూపుడు, సర్వ విఘ్నములను నివారించు క్షిప్ర ఉచ్చిష్ట గణపతి స్వరూపముగా తన ధ్యానమందు సాధించెను. కాలము గడిచిపోతూ, మరలా కొన్ని వందల సంవత్సరముల తరువాత శ్రీ విశ్వబ్రాహ్మణ కుల తిలకుదైన పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ పోతులూరి వీర 'బ్రహేంద్ర స్వాముల వారు ఇక్కడికి వచ్చినపుడు ఇక్కడికి వచ్చినపుడు అమ్మవారి యొక్క శక్తిని, ఆమె యొక్క తేజస్సును గమనించి ఇక్కడ అమ్మవారు సాక్షాత్కారముగా ప్రాణజీవముల స్పందనతో ఆయన మహానందం చెంది, ఇక్కడే కొన్ని సంవత్సరముల సాధన చేస్తూ, అమ్మవారిచే ప్రసాదింపబడిన జ్ఞానముతో “హంస కాళికాంబా సప్తశతిని రచించాడని జనుల మాట. వీరబ్రహ్మంగారి ప్రియశిష్యుడు సిద్దయ్యగారు, అతనికి ఈ పవిత్ర స్థానమునందే అన్నమును రాశిగా వుంచి (కుంభంగా) సేవించమనగా ఆయన తృటిలో రాశిని తన గురుబలముచే శేదనము (భుజించుటు చేశారట. ఈ విధముగా మహాసిద్ధ పుంగవులు తమ యొక్క సూక్ష్మ శదీరముతో బ్రహ్మ ముహూర్తమున అమ్మవారిని ఇప్పటికీ చేవిస్తూ ఉండుట మహా విశేషం. ఈ అమ్మవారు చతుర్భుజి. రెండు హస్తములందు శంఖ, చక్రములు, మరో రెండు హస్తములందు కలశము, కమలము ధరించియున్నది. మరో విశేషము ఏమనగా అమ్మవారి యొక్క ద్వితీయ హస్తములకు రాహు అనగా సర్పములు ఆభరణము లుగా ధరించినది. ఈకారణంగా రాహుకాల పూజలు నిత్యము జరుగుతూ ఉంటాయి. నేటికీ రాత్రి వేళలో పురవీధులందు అమ్మవారు సంచారము చేయు చుండునని జనశ్రుతి కూడా కలదు. అదే విధముగా పవిత్రమైన నర్మదా నది నుండి శివలింగమును తెప్పించి ఇక్కడ 01-06-1987న అమ్మవారి ఆలయమునకు కుడి ప్రక్కన మహాబుత్విక్కులచే 'ప్రతిష్టాపన చేయించారు. ఆ అత్యంత పరమ పవిత్రమైన సహజ సిద్దమైన శివలింగము చంద్రశేఖరుడుగా విశేషమైన పూజలందుకుంటున్నాడు. అప్పటి నుండి శ్రీకాళికాంబ-చందద్రశేఖర స్వామి దేవన్ధానముగా పిలువబడుచున్నది.
ఉప ఆలయములు :
శ్రీ మహాగణపతి, శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ, శ్రీ వేదమాత, పంచముఖ గాయత్రి, శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి, మరియు తూర్పుముఖముగా శ్రీ కాళీ అభయాంజనేయస్వామి 'ప్రతిష్టింపబడినారు. అదే విధంగా నవగ్రహము లు మరియు 500 సంవత్సరముల వేప వృక్షము కూడ ఇక్కడే వుండటం మరొక గొప్ప విశేషం.
ఇక్కడ జరుగు పూజా కార్యక్రమాలు :
దేవీ నవర్శాత్రులందు విశేషముగా పూజ కార్యక్రమములు, నవదుర్గల అలంకరణలు, (ఆశ్వీయుజ శు॥పాడ్యమి నుండి దశమి వరకు) దుర్దాష్టమి రోజు, దశమినాడు గ్రామోత్సవము జరుగును. ఈ నవరాత్రి వైభవం అనంతం, అసామాన్యం, కార్తీక మాసంలో మాఠమాసంలో శివునికి విశేషమైన అబిషేకాదులు నిర్వహింపబడుతూ వుంటాయి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము, శ్రావణ మాసోత్సవ పూజలు నిర్వహింపబడుతూ వుంటాయి. ఉ గాది పర్వదిన వేడుకలు వైశాఖ మాసోత్సవ పూజలు, మహా శివరాత్రినాడు లింగోద్భృవ సమయములో మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకము, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవము, మరుసటి రోజున గ్రామోత్సవము అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడుతూ వుంటాయి. 5 సం॥రములకు ఒక్కసారైనా చండీయాగము, నవ చండీయాములు నిర్వహింపబడుతూ వుండటం మరొక విశేషం. ప్రతి శుక్రవారం అభిషేకం మరియు వడిబవియ్యం దాతల ద్వారా అమ్మవారికి జరిపించబడును. ప్రతి శుక్రవారం మహామంగళ హారతి రాత్రిపూట విశేషముగా జరిపించబడును. విశేషమైన పర్వదినాలలో ప్రసాద వితరణ జరుగుతూ వుంటుంది. అదే విధంగా అప్పుడప్పుడూ అన్నదాన కార్యక్రమము కూడా నిర్వహింపబడుతూ వుంటుంది. భక్తులు కులమతాతీత ముగా అమ్మవారిని దర్శించి అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతూ వుంటారు. కావున ఇటువంటి మహా పరమ పవిత్రమైన మహాశక్తి స్వరూపిణీ మైన అమ్మవారిని ఇలలో కనీసం ఒక్కసారైనా దర్శించడం, భక్తులకు మహా 'ప్రసాదము. అమ్మవారి యొక్క సంపూర్ణ దర్శనం భక్తులకు పరమానంద సోమానము. ఆ తల్లి యొక్క కృప అందరికి కలుగవలెనని ఆశిస్తున్నాము.